dcsimg
Image of anise burnet saxifrage
Creatures » » Plants » » Dicotyledons » » Umbellifers »

Anise Burnet Saxifrage

Pimpinella anisum L.

కుప్పి సోపు నూనె ( Telugu )

provided by wikipedia emerging languages
 src=
అనిసీడ్ మొక్క
 src=
అనిసీడ్
 src=
అనిసీడ్ ఆయిల్

కుప్పు సోపు నూనె లేదా కుప్పు సోంపు నూనె ఒక ఆవశ్యక నూనె. ఇది ఒక సుగంధ తైలం. కుప్పు సోంపును హిందీలో వలైటి సౌంఫ్ అంటారు. కుప్పు సోపు చూటటానికి సోపు/పెద్ద జీలకర్రను పోలి వుండును. కుప్పిసోంపును ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. కుప్పు సోంపు మొక్క అంబేల్లిఫెర కుటుంబానికి చెందిన మొక్క. కుప్పి సోంపు మొక్కలలో పలు రకాలు ఉన్నాయి. ఆవశ్యక నూనెను పింపినెళ్ల అనిసుం ముక్క నుండి ఉత్పత్తి చేస్తారు. ( పింపినెళ్ల అఫిసినల్, పింపినెళ్ల వుల్గరే అనేవి ఇతర రకాలు).కుప్పి సోపుని అనిసే (anise) లేదా ఆనిసీడ్ (aniseed) అనికూడా అంటారు.అనిసే గింజలను స్టార్ అనిసే మరోరకం మొక్కగా అప్పుడప్పుడు పొరపాటు పడుతుంటారు.స్టార్ అనిసే మొక్క లిల్లీసియేసి కుటుంబానికి ఛేండినది.దాని వృక్ష శాస్త్ర పేరు లిల్లీసీయం వేరుమ్. అనిసే నూనెను తరచుగా ఆరోమాథెరపీలో వాడుతారు.[1]

కుప్పి సోపు మొక్క

అనిసీడ్ మధ్య తూర్పు ప్రాంతానికి చెందినది. వర్తమాన కాలంలో (2018 నాటికి) యూరోప్, అమెరికా,, ఉత్తర ఆఫ్రికాలలో సాగు చేస్తున్నారు.ఇది ఏక వార్షికమొక్క 80 సెం.మీ ఎత్తు (రెండు అడుగులన్నర) ఎత్తు పెరుగును.సున్నితమైన తేలిక ఆకులను కల్గి వుండును. చిన్నని తెల్లని పూలు పూయును.విత్తనాలు గ్రెయిష్ బ్రౌన్ రంగులో వుండును.పురాతన కాలం నుండి రోమనులు, ఈజిప్తులు,, గ్రీకులు ఈ నూనెను ఉపయోగించారు.రోమనులు ముస్తాసియస్ (mustaceus) అనే కేకులో వాడగా, ఈజిప్టులు బ్రేడ్డు (దిబ్బరోట్టె) లో కలిపి వాడేవారు.ఇక గ్రీకులు జీర్ణ వ్యవస్థలోని ఇబ్బందులు తగ్గించుటకు వాడారు.[1] కుప్పి సోపు గింజలోని పదార్థాలు

ఈ పంటను బల్గేరియా, సిప్రస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, మెక్సికో, దక్షిణ అమెరికా, సిరియా, టర్కీ, స్పైన్, ఇంగ్లాండు, రష్యా, ఇండియా దేశాలలో సాగు చేస్తున్నారు.. ఇండియాలో నూనె ఉత్త్పత్తికి కాకుండా కేవలం వంటల్లోవాడటానికి కుప్పి సోపునుసాగు చేస్తున్నారు.[2]

భారతీయ భాషల్లో కుప్పి సోపు పేరు

భారతీయ భాషల్లో కుప్పి సోపు పేర్లు ఇలావున్నాయి[3]

  • హింది=Valaiti saunf or aawonf
  • బెంగాలి=Muhuri, Mitha jira
  • గుజరాతి=Anisi, Sowa
  • కన్నడ=sompu
  • మలయాళం=Shombu
  • మరాటీ=Somp, Badishop
  • ఒరియా=Sop
  • పంజాబీ=Valaiti sounf
  • సంస్క్ర్తంతం=Shatapusapa
  • తమిళం=Shombu

నూనె సంగ్రహణ

నూనెను విత్తనాల నుండి నీటి ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు.

నీటి ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతి ప్రధాన వ్యాసం ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ చదవండి

నూనె

కుప్పి సోపు నూనె కొద్ధిగా మధ్యస్తాయి చిక్కదనం (స్నిగ్థత) కల్గి వుండును. తక్కువ ఉష్ణోగ్రత వద్ద గట్టి పడును (ఘన స్థితిచెందును).[1]

నూనెలోని రసాయన సంయోగపదార్థాలు

నూనెలోని పలు వృక్షరసాయనాలు వున్నవి వాటిలో ముఖ్యమైనవి ఆల్ఫా-పైనేన్, కాంపెన్, బీటా పైనేన్, లినలూల్, సీస్-అనేథోల్, ట్రాన్స్- అనేథోల్, సఫ్రోల్, అనిస్ అల్డిహైడ్, ఆసిటో అనిసోల్లు.

భౌతిక గుణాలు

కుప్పి సోపు నూనె భౌతిక గుణాల పట్టిక[4]

ఉపయోగాలు

  • నూనెను కండరాల నొప్పులకు, బాధలకు ఉపయోగిస్తారు.అలాగే కీళ్ల వాత నొప్పులకు, శ్వాసకోశ జబ్బులకు, కోరింత దగ్గు, ప్రేగులకు సంబంధించిన రోగాలను, అజీర్తిని, అరుచిని తగ్గించును[1]
  • సుగంధ తైలంగా ఉపయోగిస్తారు.ఇతర సుగంధ నూనెలతో మిశ్రమం చేసి ఉపయోగిస్తారు.
  • యాంటి బాక్టీరియా, యాంటి ఫంగల్, యాంటి ఆక్సిడెంట్, ౘుఱుకు పుట్టించెడు (ఔషధ) గుణం, జీర్ణకారి, వాయు హరి గుణాలు కల్గి ఉంది.
  • కండరాలను సదలింపు చేయు గుణం, క్రిమి సంహరక గుణం, గ్లూకోజ్ శోషణగుణం కల్గి ఉంది.[6]
  • మూర్చరోగాన్ని హైపరు టెన్సను తగ్గించును.

వాడకంలో ముందు జాగ్రత్తలు

గాఢత నూనె సున్నిత చర్మ మున్న కొందరికి చర్మం పై చెడు ప్రభావం చూపవచ్చును. అందువలన అటు వంటి వారు వాడరాదు.అలాగే ఎక్కువ మోతాదులో తీసుకున్న సర్కులేసన్ తగ్గిపోయి cerebral congestion (మెదడులో రక్తం ఒకచోటాధికంగా చేరడం) ఏర్పడవచ్చు.గర్భంతో వున్నప్పుడు స్ర్తీలు వాడరాదు.[1]

బయటి వీడియో లింకులు

ఇవికూడా చూడండి

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Aniseed essential oil information". essentialoils.co.za. https://web.archive.org/web/20180227171928/https://essentialoils.co.za/essential-oils/aniseed.htm. Retrieved 18-09-2018.
  2. "ANISEED". indianspices.com. https://web.archive.org/web/20180816093623/http://www.indianspices.com/spice-catalog/aniseed. Retrieved 18-09-2018.
  3. "ANISEED". indianspices.com. https://web.archive.org/web/20180816093623/http://www.indianspices.com/spice-catalog/aniseed. Retrieved 19-09-2018.
  4. "ANISE OIL". cameochemicals.noaa.gov. https://web.archive.org/web/20170508100636/https://cameochemicals.noaa.gov/chemical/19821. Retrieved 19-09-2018.
  5. "Anise oil". chemicalbook.com/. https://web.archive.org/web/20171219202836/https://www.chemicalbook.com/ProductMSDSDetailCB4415789_EN.htm. Retrieved 1-09-2018.
  6. "Anise (Pimpinella anisum)". sigmaaldrich.com. https://web.archive.org/web/20170923181141/https://www.sigmaaldrich.com/life-science/nutrition-research/learning-center/plant-profiler/pimpinella-anisum.html. Retrieved 19-09-2018.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు